సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: సర్వాంతరాత్ముడవు
టైటిల్: సర్వాంతరాత్ముడవు
పల్లవి:
ప|| సర్వాంతరాత్ముడవు శరణాగతుడ నేను | సర్వాపరాధినైతి చాలుజాలునయ్యా ||
చరణం:చ|| వూరకున్నజీవునికి వొక్కొక్క స్వతంత్రమిచ్చి | కోరేటియపరాధాలు కొన్ని వేసి |
నేరకుంటే నరకము నేరిచితే స్వర్గమంటూ | దూరువేసేవింతేకాక దోషమెవ్వరిదయ్యా ||
చ|| మనసు చూడవలసి మాయలు నీవే కప్పి | జనులకు విషయాలు చవులుచూపి |
కనుగొంటే మోక్షమిచ్చి కానకుంటె కర్మమిచ్చి | ఘనము సేసేవిందు కర్తలెవ్వరయ్యా ||
చ|| వున్నారు ప్రాణులెల్లా నొక్కనీగర్భములోనే | కన్నకన్న భ్రమతలే కల్పించి |
యిన్నిటా శ్రీవేంకటేశ యేలితివి మమ్ము నిట్టె | నిన్ను నన్ను నెంచుకుంటే నీకే తెలియునయ్యా ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం