సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: సర్వేశ్వరుడే
పల్లవి:

ప|| సర్వేశ్వరుడే శరణ్యము | నిర్వాహకు డిన్నిటగాన ||

చరణం:

చ|| పలుదేవతలకు బ్రహ్మాదులకు | జలజనాభుడే శరణ్యము |
అలరిన బ్రహ్మాండ మలసిననాడును | నిలిపినాడితడు ఇన్నిటగాను ||

చరణం:

చ|| అనేక విధముల సకల జీవులకును | జనార్దనుడే శరణ్యము |
అనాథ నాథు డంతరాత్మకుడు | అనాది పతి యితడటుగాన ||

చరణం:

చ|| తగు నిశ్చలులగు తనదాసులకును | జగదేక పతియే శరణ్యము |
చిగురు చేవ యగు శ్రీ వేంకటేశుడు | అగు వరము లొనగు నటుగాన ||

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం