సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: సర్వేశ్వరుడవు
పల్లవి:

ప|| సర్వేశ్వరుడవు స్వతంత్రడువు నీవు | సర్వోత్తముడ నన్నిచట కావవే ||

చరణం:

చ|| శక్తిగలిగితే నీ సరుసదేవుడ గాన | యుక్తి గలిగితే నే నొడలు మోతునా |
యుక్తియు శక్తియు ఒకటే లేక | భక్తుడనైతి నన్ను పాలింపవే ||

చరణం:

చ|| బహుపుణ్యుడనైతే బ్రహ్మపట్టమేలనా | సహజ విజ్ఞానినైతే సంసారి నౌదునా |
విహిత పుణ్య జ్ఞాన విముఖుడ గనకనే | అహిశయనుడ శరణంటి కావవే ||

చరణం:

చ|| శ్రీవేంకటేశ నీవు చేసిన ప్రతిమ నింతే | నీవెరుగనిది లేదు నేరుపు నాయందు నీదే |
భావము లోపల నీవే పైకొని బుద్ధియ్యగాను | నీవాడ ననుకొంటి నేడు కావవే ||

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం