సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: సర్వజ్ఞత్వము
పల్లవి:

సర్వజ్ఞత్వము వెదకగనొల్లను సందేహింగనొల్లను
సర్వజ్ఞుండను నాచార్యుండే సర్వశేషమే నాజీవనము ||

చరణం:

యెఱగనొల్లము విజ్ఞానపుగతి యెఱుకలు నే మిటుసోదించి
యెఱిగి యితరులను బోధించెదమనుయీపెద్దరికము నొల్లము
యెఱిగేటివాడును యాచార్యుండే, యెఱుకయు సర్వేశ్వరుడే
యెఱుకయు మఱపును మానివుండుటే యిదియేపో మావిజ్ఞానము ||

చరణం:

చదువగనొల్లము సకలశాస్త్రములు సారెకుసారెకుసోదించి
చదివి పరులతో యుక్తివాదములు జగడము గెలువగనొల్లము
చదివేటివాడును నాచార్యుండే, చదువును నాయంతర్యామే
చదువుకు జదువమికి దొలగుటే నానాసాత్వికభావమే నా తెలివి ||

చరణం:

అన్నిటికిని నే నధికారిననెడియహంకారము నొల్లను
కన్నులజూచుచు నందరిలో నే గాదని తొలగానొల్లను
మన్నన శ్రీవేంకటేశ్వరుకరుణను మాయాచార్యుడే అధికారి
వున్నరీతినే అస్తినాస్తులకు నూరకుండుటే నాతలపు ||

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం