సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: సర్వోపాయములు జగతి
పల్లవి:

ప|| సర్వోపాయములు జగతి నాకితడే | వుర్వీధరుడు పురుషోత్తముండితడే ||

చరణం:

చ|| సకలగంగాతీర్థ స్నానఫలములివి స్వామిపుష్కరణి జలమేనాకు |
సకలపుణ్య క్షేత్రవాసయాత్రలివి సరి వేంకటాచల విహారమిదియే |
సకలవేదాధ్యన శాస్త్రపాఠంబులివి శౌరిసంకీర్తనంబిదియే నాకు |
సకలకర్మానుష్ఠానముల యితనికిచ్చట జాతువడికైంకర్యమిదియే ||

చరణం:

చ|| ఉపవాసములివి యితనిప్రసాదంబులొగి భుజింపుటే నాకు దినదినంబు |
జపరహస్యోపదేశంబు లితనిపాదజలంబుల శరణనేటి సేవయొకటే |
ఉపమింప బుణ్యపురుషులదర్శనము నాకు నొగినిచటి బహువృక్ష దర్శనంబు |
యెపుడు బుణ్యకథాశ్రవణంబు లిచ్చోటయెన్నగల బహుపక్షి కలకలంబు ||

చరణం:

చ|| తలపుగల యోగంబులందు శ్రీవైష్ణవుల దగులుసంవాస సహయోగంబు |
వెలయ నిండుమహోత్సవంబు లిన్నియు నితనివిభవంబులెసగు తిరునాళ్ళు నాకు |
చెలగి యిటు దేవతాప్రార్థనింతయు నాకు శ్రీవేంకటేశుని శరణాగతి |
అలరునాసంపదలు యితని పట్టపురాణి అలమేలు మంగకడకంటి చూపు ||

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం