సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: సతి చక్కదనమెంతో
పల్లవి:

ప|| సతి చక్కదనమెంతో సరసుని మోహమెంతో | చతురలింక సరి జూడరమ్మా ||

చరణం:

చ|| కాంత కన్నులు వ్రాసి కడలు వ్రాయగ రాక | చింత తోడ దలవంచె జెలి విభుడు |
పంతపు నడుము వ్రాసిబయలు వ్రాయగ రాక | కొంత దడ వుస్సురనె గోమలి ప్రాణేశుడు ||

చరణం:

చ|| కలికి కుచాలు వ్రాసి కఠినము వ్రాయలేక | తలపోయ దొడగె బంతపు విభుడు |
నళినాక్షి మోము వ్రాసి నవ్వులు వ్రాయగరాక | నిలువున వెరగందె నెలత రమణుడు ||

చరణం:

చ|| వనిత కౌగిట దన్ను వ్రశి రతి వ్రాయలేక | తనువెల్ల మరచెను తమకమున |
వెనక ముందర వ్రాసి వేడుక వ్రాయగరాక | చినుకు జెమట వ్రాసె శ్రీవేంకటేశుడు ||

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం