సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: సతి నిన్ను
టైటిల్: సతి నిన్ను
పల్లవి:
ప|| సతి నిన్ను గెలిచెను జవ్వనపు గరిడిలో | మతిలోన మెచ్చి మెచ్చి మన్నించు రమణుడా ||
చరణం:చ|| కనుసూటి వలపూ కాంత చూచిన చూపు | కొనకెక్కె మరుడదె గురులేసెను |
మొనకత్తిసామూ ములువాడి కొనగోరు | పెనగి చెక్కులనొత్తి పేరము వారెను ||
చ|| చేసూటి వలపూ చెలి కాగిలించినది | బాసతోనే కాయజుడు పందెమాడెను |
మూసిదింపు మొరగూ ముంచిన పయ్యదకొంగు | ఆసలు నీకుజూపి ఆయాలు రేచెను ||
చ|| మొగసూటివలపూ మోహపు రమణినవ్వు | తగవుతో మదనుడు దారగట్టెను |
అగపడి శ్రీవేంకటాధిప నీవు గూడితి | జగడమింతయు దీరిచనవు చేకొనెను ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం