సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: సతతము నేజేయు
టైటిల్: సతతము నేజేయు
పల్లవి:
ప|| సతతము నేజేయు ననాచారములకు గడ యెక్కడ | మతి ననుగని కావుము రామా రామా రామా||
చరణం:చ|| సేసిననాబ్రహ్మహత్యలు శిశుహత్యలు గోహత్యలు | ఆసలనెన్నో యెన్నో ఆయాజాడలను |
యీసున నే నిపు డెరిగియునెరగక సేసేదురితపు- | రాసులకును గడలే దిదె రామా రామా రామా||
చ|| నమలెడినానాచదువులకు నానావిధభక్షణములు | కమిలినదుర్గంధపుశాకమ్ములు దొములును |
జముబాధల నరకంబుల సారెకు నన్నెటువలె శ్రీ- | రమణుడ ననుగాచే విటు రామా రామా రామా||
చ|| కపటపునాధనవాంఛలు కలకాలము బరకాంతల | జపలపుదలపుల సేతలసంఖ్యము లరయగను |
యెపుడును నిటువలెనుండెడుహీనుని నన్నెటు గాచెదో | రవమున శ్రీవేంకటగిరిరామా రామా రామా||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం