సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: సతతవిరక్తుడు
పల్లవి:

ప|| సతతవిరక్తుడు సంసారిగాడు | రతిసమ్మదుడు విరక్తుడు నితడె ||

చరణం:

చ|| నిత్యుడైనవాడు నిఖిలలోకముల- | బ్రత్యక్ష విభవసంపన్నుడు గాడు |
నిత్యుడు నితడే నిరుమానుడైన- | ప్రత్యక్ష విభవ సంపన్నుడితడె ||

చరణం:

చ|| యోగియైనవాడు నొనర నేకాలము | భోగియై భోగిపై భోగింపలేడు |
యోగియు నితడే వుడుగక భోగిపై | భోగించునటువంటి పురుషుండు నితడే ||

చరణం:

చ|| దేవుడైనవాడు దెలుప లోకముల | దేవతారాధ్యుడై దీపింపలేడు |
దేవుడు నితడే దివిజవంద్యుడైన | శ్రీ వేంకటగిరి దేవుండితడె ||

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం