సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: సత్యభామ సరసపు
పల్లవి:

సత్యభామ సరసపు నగవు
నిత్యము హరి మదినే నెలవు ||

చరణం:

రుకుమిణి దేవికి రూపయవ్వనికి
సకల విభవముల సౌఖ్యతలు
చికురాంబరమున జెదరిన యలకలు
వికచాబ్జ ముఖము వెయి వేలాయె ||

చరణం:

తొడవుల శ్రీసతి తొలిమెరుగులమై
నడపులమురిపెపు నగుమోము
తడయక వారిధి దచ్చిన హరికిని
బడలికవాపను పరమంబాయ ||

చరణం:

అనుదినమునును నీ యలుమేలుమంగ
కనుగవ జంకెన గర్వములు
దినదినంబులును తిరువేంకటపతి
చనువుల సొబగుల సంపదలాయ ||

అర్థాలు



వివరణ