సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: సుగ్రీవ నారసింహ
టైటిల్: సుగ్రీవ నారసింహ
పల్లవి:
సుగ్రీవ నారసింహ సులభుడ వందరికి |
అగ్రేసరుడ నీవు అవధారు దేవ ||
సనకాదులొకవంక జయవెట్టుచున్నారు |
ఎనసి సురలు చేతులెత్తి మొక్కేరు |
మును లిరుమేలనుండి మునుకొని నుతించేరు |
అనుపమాలంకార అవధారు దేవ ||
గంగాది నదులెల్ల కడిగి నీపాదములు |
పొంగుచు సప్తర్షులు పూజించేరు |
సంగతి వాయుదేవుడు సరి నాలవట్టమిడీ |
అంగజ కోటిరూప అవధారు దేవ ||
పరగ నారదాదులు పాడేరు నీచరిత |
పరమ యోగీంద్రులు భావించేరు |
సిరులు మించినయట్టి శ్రీవేంకటాద్రిమీద |
అరుదుగ నున్నాడవు అవధారు దేవ ||