సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: సులభమా యిందరికి
టైటిల్: సులభమా యిందరికి
పల్లవి:
ప|| సులభమా యిందరికి జూడ సులభముగాక | కలిగె మీకృప నాకు గమలరమణా ||
చరణం:చ|| సతతదయాచారసంపన్నుడై మఱికదా | అతిశయవైష్ణవాన కరుహుడౌట |
వ్రతోపవాసతీర్థవరసిద్దుడై కదా | మితిమీరి నరహరి మీదాసుడౌట ||
చ|| సకలయజ్ఞఫలము సత్యము ఫలముగదా | ప్రకటించి విష్ణునామపాఠకుడౌట |
అకలంకమతితోడ నాజన్మశుద్ధుడై కదా | అకుటిలమగుమీచక్రాంకితుడౌట ||
చ|| కెరలి సదాచార్యకృపగలిగినగదా | నిరతి శ్రీవేంకటేశ నిన్ను గనుట |
మరిగి మీపై భక్తి మఱి ముదిరినగదా | అరయ మీకే శరణాగతుడౌట ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం