సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: సులభుడు మధుసూదనుడు
పల్లవి:

ప|| సులభుడు మధుసూదనుడు మన- | మెలమి నమ్మిన నిట్టేనుండీ ||

చరణం:

చ|| పడుచుమాటన కాప్రహ్లాదునెదుట | పొడచూపె నాదిపురుషుడు |
అడవిదేహనక ఆదంతిమొరకును | తడవికాచిన దైవముసుండీ ||

చరణం:

చ|| ఆడుమాటలనక అంతలో ద్రౌపదిని | వాడిమి గాచినవరదుడు |
పోడిమి బేదనక పొందినకుచేలుని | వీడె సంపదిచ్చె విష్ణుడు సుండీ ||

చరణం:

చ|| వీరువారన కిదె వేడినవరములు | సారెకు నిచ్చిన సర్వేశుడు |
మేరతో లోకముల మెరసె నిప్పుడును | యీరీతి శ్రీవేంకటేశుడేసుండీ ||

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం