సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: సువ్వి సువ్వి సువ్వాలమ్మా
టైటిల్: సువ్వి సువ్వి సువ్వాలమ్మా
పల్లవి:
సువ్వి సువ్వి సువ్వాలమ్మా
నవ్వుచు దేవకి నందను గనియె॥
శశి వొడచె అలసంబులు గదచె
దిశల దేవతల దిగుళ్ళు విడచె॥
కావిరి విరిసె కంసుడు గినిసె
వావిరి పువ్వుల వానలు గురిసె॥
గతి సేసె అటు గాడిద గూసె
కుతిలకుడిచి జనకుడు నోరు మూసె॥
గగురు పొడిచె లోకము విధి విడిచె
మొగులు గురియగ యమునపై నదచె॥
కలిజారె వేంకటపతి మీరె
అలమేల్మంగ నాంచారమ్మకలుకలు తీరె॥
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం