సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: సువ్వి సువ్వి సువ్వి
పల్లవి:

ప|| సువ్వి సువ్వి సువ్వి సువ్వని | సుదతులు దంచెద రోలాల ||

చరణం:

చ|| వనితలు మనసులు కుందెన చేసిటు | వలపులు తగనించోలాల |
కనుచూపు లనెడు రోకండ్లను | కన్నెలు దంచెద రోలాల ||

చరణం:

చ|| బంగరు చెరుగుల పట్టు పుట్టములు | కొంగులు దూలగ నోలాల |
అంగనలందరు నతివేడుకతో | సంగడి దంచెద రోలాల ||

చరణం:

చ|| కురులు దూలగ మంచి గుబ్బచనులపై | సరులు దూలాడగ నోలాల |
అరవిరి బాగుల నతివలు ముద్దులు | గురియుచు దంచెద రోలాల ||

చరణం:

చ|| ఘల్లు ఘల్లుమను కంకణరవముల | పల్లవపాణుల నోలాల |
అల్లన నడుములు అసియాడుచు సతు | లొల్లనె దంచెద రోలాల ||

చరణం:

చ|| కప్పురగంధులు కమ్మనిపువ్వుల | చప్పరములలో నోలాల |
తెప్పలుగా రతి దేలుచు గోనే- | టప్పని బాడెద రోలాల ||

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం