సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: తానె తానే
పల్లవి:

తానె తానే యిందరి గురుడు
సానబట్టిన భోగి జ్ఞాన యోగి ||

చరణం:

అపరిమితములైన యజ్ఞాల వడిజేయ
బ్రపన్నులకు బుద్ధి వచరించి
తపముగా ఫలత్యాగము సేయించు
కపురుల గరిమల కర్మయోగి ||

చరణం:

అన్నిచేతలను బ్రహ్మార్పణవిధి జేయ
మన్నించు బుద్ధులను మరుగజెప్పి
ఉన్నతపదమున కొనరగ గరుణించు
పన్నగశయనుడే బ్రహ్మయోగి ||

చరణం:

తనరగ గపిలుడై దత్తాత్రేయుడై
ఘనమైన మహిమ శ్రీ వేంకటరాయడై
వినరగ సంసార యోగము గృపసేయు
అనిమిషగతుల నభ్యాసయోగి ||

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం