సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: తానే తెలియవలె
టైటిల్: తానే తెలియవలె
పల్లవి:
ప|| తానే తెలియవలె తలచి దేహి తన్ను | మానుపువారలు మరి వేరీ ||
చరణం:చ|| కడలేనిభవసాగరము చొచ్చినతన్ను | వెడలించువారలు వేరీ |
కడుబంధములచేత గట్టుపడినతన్ను | విడిపించువారలు వేరీ ||
చ|| కాగినినుమువంటి కర్మపుతలమోపు- | వేగు దించేటివారు వేరీ |
మూగినమోహపుమూకలు తొడిబడ | వీగదోలేటి వారలువేరీ ||
చ|| తిరువేంకటాచలాధిపుని గొలువుమని | వెరవుచెప్పెడువారు వేరీ |
పరివోనిదురితకూపముల బడకుమని | వెరవుచెప్పెడివారు వేరీ ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం