సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: తాపలేక మేడ
టైటిల్: తాపలేక మేడ
పల్లవి:
ప|| తాపలేక మేడ లెక్కదలచేము | యేపులేని చిత్తముతో యీహీహీ నేము ||
చరణం:చ|| ఎఱుకమాలినబుద్ధి నెవ్వరైనా బతులంటా | తెఱగెఱగక వీధి దిరిగేము |
పఱచైన జవరాలు పరులెల్లా మగలంటా | వొఱపునిలిపిన ట్లోహోహో నేము ||
చ|| యిందరును హితులంటూ యెందైనా సుఖమంటా | పొందలేనిబాధ బొరలేము |
మందమతివాడు యెండమావులు చెరువులంటా | అందునిందు దిరిగిన ట్లాహాహా నేము ||
చ|| మేటివేంకటేశు బాసి మీదమీద జవులంటా | నాటకపుతెరువుల నడిచేము |
గూటిలో దవ్వులవాడు కొండలెల్ల నునుపంటా | యేటవెట్టి యేగిన ట్లీహీహీ నేము ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం