సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: తారకబ్రహ్మము
టైటిల్: తారకబ్రహ్మము
పల్లవి:
ప|| తారకబ్రహ్మము తానైవున్నాడు | ధారుణిలో చెలువొందె దశరథరముడు ||
చరణం:చ|| కొండలంతలు వానరకోటులు కొలువగాను | దండితో కొలువున్నాడు తగరాముడు |
అండనే సీతాదేవి అమరి కూచుండగాను | మెండుగ సింహాసనాన మెరసీ రాముడు ||
చ|| వామదేవ కౌశిక వశిష్ఠాదుల విన్నపాలు | ఆముకొని వినుచున్నాడు అదె రాముడు |
గోమున భరత శత్రుఘ్నులు ఛత్రచామరాలు | కామించి పట్టుకుండగా కడుమించే రాముడు
చ|| కనక పుష్పకము చెంగట వీరాసనము తో- | ననిచి ఆనందాన నున్నాడు రాముడు |
ఘన శ్రీ వేంకటాద్రిపై కల్పవృక్షము నీడ | హనుమంతుని చదువులాలకించీ రాముడు ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం