సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: తెలిసి చెప్పేనంటే
టైటిల్: తెలిసి చెప్పేనంటే
పల్లవి:
ప|| తెలిసి చెప్పేనంటే తేటతెల్లమి నాగుట్టు | కలసిన వాడవు కరుణించవయ్యా ||
చరణం:చ|| మోము చూచిన వాడవు మోహించక మానేవా | కోమలపు దాననై కొసరే గాక |
చేముట్టిన వాడవు సేవగొనక మానేవా | దామెన కోరికలతో దమకించే గాక ||
చ|| సేసవెట్టిన వాడవుచెనకక మానేవా | ఆసపడ్డదాననై యడిగే గాక |
బాస యిచ్చిన వాడవు పైకొనక మానేవా | చేసూటి వలపుల జిమ్మిరేగే గాక ||
చ|| యీడ నన్నేలిన వాడవింటికి రాక మానేవా | జోడైన దాననయి సొలసే గాక |
కూడితి విట్టె నన్ను గొబ్బున శ్రీవేంకటేశ | జాడెఱగక మానేవా చాటి చెప్పే గాక ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం