సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: తెలిసిన బ్రహ్మోపదేశ
టైటిల్: తెలిసిన బ్రహ్మోపదేశ
పల్లవి:
ప|| తెలిసిన బ్రహ్మోపదేశ మిదె | సులభ మనుచు నిదే చూచీగాక ||
చరణం:చ|| పుట్టించినహరి పూరి మేపునా | గట్టిగా రక్షించుగా కతడు |
కట్టడిజీవుడు కానక నోళ్ళు | తెట్టదెరువునకు తెఱచీ గాక ||
చ|| అంతరాత్మ తనునట్టే మఱచేనా | చింత లో బెరరేచీగాక |
పంతపుజీవుడు భ్రమసి సందుసుడి | దొంతలు దొబ్బుచు దూరీగాక ||
చ|| నొసల వ్రాసినవి నోమించుగా కత- | డెసగిన శ్రీవేంకటేశ్వరుడు |
విసుగక జీవుడు వీరిడిమాయల- | నసురసురయి తా నలసీగాక ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం