సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: తెలిసిన తెలియుడు
టైటిల్: తెలిసిన తెలియుడు
పల్లవి:
ప|| తెలిసిన తెలియుడు తెలియని వారలు | తొలగుడు బ్రహ్మాదులె యెరుగుదురు ||
చరణం:చ|| వరదు డఖిలదేవతలకు వంద్యుడు | గరుడు డసురులకు కంటకుడు |
పరమాత్ముడంబుజ భవ శివాదులకు | పరుల కెల్ల మువ్వురిలో నొకడు ||
చ|| దేవుడు సనకాది మునులకును పర- | దైవమఖిల వేదములకును |
కైవల్యమొసగు ఘననిధికి | మహానిధి జడులకు యాదవకులుడు ||
చ|| ఆద్యుడు అచలుడు మహాభూతమితడు | అభేద్యుడసాధ్యుడు భీకరుడు |
సద్యఃఫలదుడు సకల మునులకును | వేద్యుడితడెపో వేంకటవిభుడు ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం