సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: తెలిసియు నత్యంతదీనుడై
టైటిల్: తెలిసియు నత్యంతదీనుడై
పల్లవి:
ప|| తెలిసియు నత్యంతదీనుడై తన్ను | దెలియగగోరేటితెలివే పో తెలివి ||
చరణం:చ|| వలచినసతి దన్ను వడి గాలదన్నిన | అలరి యెట్లా నుబ్బు నటువలెనే |
తలక కెవ్వరు గాలదవ్వినా మతిలోన | అలుగక ముదమందునదివో తెలివి ||
చ|| అరిదిమోహపు వనిత ఆలిపై దిట్టిన- | నరవిరై చొక్కినయటువలెనే |
పరులు దన్ను వెలుపల నిట్ల బలికిన | అరలేక రతి జొక్కునదివో తెలివి ||
చ|| తనివోక ప్రియకాంత తమ్ములపురస మాన- | ననయమును నటు గోరునటువలెనే |
తనర వేంకటపతి దాసుల ప్రసాదంబు | అనిశమును గొనగోరునదివో తెలివి ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం