సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: తెలియక వూరక
టైటిల్: తెలియక వూరక
పల్లవి:
ప|| తెలియక వూరక తిరిగేము | చలమరి కగునా సంతతసుఖము ||
చరణం:చ|| హేయము కడుపున నిడుకొని యింకా | చీ యనినమాకు సిగ్గేది |
పాయము పిడికిట బట్టుచునుండేటి- | కాయధారులకు గలదా విరతి ||
చ|| అంగనలరతులయాసలనీదేటి- | యెంగిలిమనుజుల కెగ్గేది |
ముంగిట నార్గురుముచ్చులగూడిన- | దొంగగురుని కిందుల నిజమేది ||
చ|| జననమరణములు సరిగని కానని | మనుజాధమునకు మహిమేది |
యెనగొని శ్రీవేంకటేశు శరణమిటు | గని మనకుండిన గతి యిక నేది ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం