సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: తెలియరాదు మాయాదేహమా
టైటిల్: తెలియరాదు మాయాదేహమా
పల్లవి:
ప|| తెలియరాదు మాయాదేహమా మమ్ము | పలువికారాలబెట్టి పనిగొన్న దేహమా ||
చరణం:చ|| దినమొక్కవయసెక్కే దేహమా సారె | పెనుమదముగురిసేబెండు దేహమా |
దినదినరుచిగోరే దేహమా నన్ను | ఘనమోహపాశాల గట్టెగదె దేహమా ||
చ|| తెలివినిద్రలుగల దేహమా నీ- | పొలము పంచభూతాలపొత్తు దేహమా |
తిలకించి పాపపుణ్యాల దేహమా | బలుపుగలదాకా బదుకవో దేహమా ||
చ|| తీరనిసంసారపు దేహమా యిట్టె | వూరట లేనిభోగాల వోదేహమా |
కూరిమి శ్రీవేంకటేశు గొలిచితినిక నాకు | కారణజన్మమవై కలిగిన దేహమా ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం