సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: తెల్లవారనియ్యరో
టైటిల్: తెల్లవారనియ్యరో
పల్లవి:
ప|| తెల్లవారనియ్యరో తెరువు యీ- | పల్లదపుదొంగలెల్ల బారాడుతెరువు ||
చరణం:చ|| దొంతరపూవులతోట తూరుపుదెరువు | చింతపూవుదేనెలచెమ్మతెరువు |
సంతులేనిసతియింటిచాయతెరువు | యింతలోనె చలిబడి యెండదాకేతెరువు ||
చ|| పముపుట్టగొంటిమీదిపడుమటితెరువు | చీమకదొంతరలోనిచిన్నతెరువు |
గాములుగాచుకయుండే గాలితెరువు | యేమిటా నెక్కడవుత నెరగనితెరువు ||
చ|| అన్నిదిక్కులును దానేయైవున్న్నతెరువు | పన్నీటికాలువలబాటతెరువు |
కన్నుల వేంకటపతి గన్నతెరువు | మిన్నునేలగూడినమీదితెరువు ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం