సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: తెప్పగా మర్రాకు
పల్లవి:

తెప్పగా మర్రాకు మీద తేలాడువాడు
ఎప్పుడు లోకములెల్ల నేలేటివాడు ||

చరణం:

మోతనీటి మడుగులో యీతగరచినవాడు
పాతగిలే నూతిక్రింద బాయనివాడు
మూతిదోసిపట్టి మంటిముద్ద పెల్లగించువాడు
రోతయైన పేగుల పేరులు గలవాడు ||

చరణం:

కోడికూత నోరివాని కుర్రతమ్ముడైనవాడు
బూడిద బూసినవాని బుద్ధులవాడు
మాడవన్నె లేడివెంట మాయలబడినవాడు
దూడల నావులగాచి దొరయైనవాడు ||

చరణం:

ఆకసానబారే వూరి అతివల మానముల
కాకుసేయువాడు తురగముపైవాడు
ఏకమై వేంకటగిరి నిందిరారమణి గూడి
యేకాలముబాయని యెనలేనివాడు ||

అర్థాలు



వివరణ