సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: తగుతగు నీ
టైటిల్: తగుతగు నీ
పల్లవి:
ప|| తగుతగు నీ దొరతనము లిక | వెగటు లన్నియును వేడుకలాయ ||
చరణం:చ|| విరసపు తిట్లు వేవేలు దిట్టిన | సరసపు వేళల చవులాయ |
యెరవుల చేత నీ వేమి సేసినా | సరినా కౌగుట చందములాయ ||
చ|| బొమ్మ జంకెనలు పొరి నెన్నైనా | నమ్మితి చితే చవులాయ |
దిమ్మరివై యెందు దిరిగి వచ్చినా | నెమ్మి నన్నేలగా నేరుపులాయ ||
చ|| అంగము లలయగ నంటబెనగినా | సంగడి రతులను చవులాయ |
రంగు శ్రీ వేంకటరమణ నన్నెనసితి- | వెంగిలి మోవుల కిచ్చకమాయ ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం