సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: తహతహలిన్నిటికి
టైటిల్: తహతహలిన్నిటికి
పల్లవి:
ప|| తహతహలిన్నిటికి తానే మూలము గాన | సహజాన నూరకున్న సంతతము సుఖము ||
చరణం:చ|| భారమైపదివేలుపనులు గడించుకొంటే | సారెసారె నలయించకపోవు |
తీరనియాసోదము దేహములో నించుకొంటే | వూరూర దిప్పితిప్పి వొరయకమానవు ||
చ|| వుండివుండి కిందుమీదు వుపమ జింతించుకొంటే | వుండుబో మంచముకింద నొకనూయి |
కొండంతదొరతనము కోరి మీద వేసుకొంటే- | నండనే యాబహురూపమాడకపోదు ||
చ|| మనసురానివైన మంచిని చేసుకొంటే | తినదిన వేమైన దీపవును |
తనిసి శ్రీవేంకటేశు దాసానుదాసుడైతే | యెనయుచు నేపనికెదురే లేదు ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం