సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: తీపనుచు చేదు
టైటిల్: తీపనుచు చేదు
పల్లవి:
ప|| తీపనుచు చేదు తెగదని వెనక బడరాని- | ఆపదలచేత బొరలాడేము గాన ||
చరణం:చ|| అప్పుదీరినదాకా నలవోకకైనవా- | రెప్పుడును దనవార లేలౌదురు |
అప్పటప్పటికి బ్రియ మనుభవింపుచు మమత | చెప్పినటువలె దాము సేయవలెగాక ||
చ|| పొందైన వారమని పొద్దు వోకకు దిరుగు- | యిందరును దమవార లేలౌదురు |
కందువగు తమకార్యగతులు దీరినదాక | సందడింపుచు బ్రియము జరపవలెగాక ||
చ|| తెగనికర్మము దమ్ము దిప్పుకొని తిరిగాడ | అగడుకోరిచి పెక్కులాడ నేమిటికి |
తగువేంకటేశ్వరుని దలచియిన్నిటా దాము | విగతభయులయి భ్రాంతి విడువవలె గాక ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం