సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: తిరుమలగిరిరాయ
టైటిల్: తిరుమలగిరిరాయ
పల్లవి:
ప|| తిరుమలగిరిరాయ దేవరాహుత్తరాయ | సురతబిన్నాణరాయ సుగుణకోనేటిరాయ ||
చరణం:చ|| సిరులసింగారరాయ చెలువపుతిమ్మరాయ | సరసవైభవరాయ సకలవినోదరాయ |
వరవసంతములరాయ వనితలవిటరాయ | గురుతైన తేగరాయ కొండలకోనేటిరాయ ||
చ|| గొల్లెతలవుద్దండరాయ గోపాలకృష్ణరాయ | చల్లువెదజాణరాయ చల్లబరిమళరాయ |
చెల్లుబడిధర్మరాయ చెప్పరానివలరాయ | కొల్లలైన భోగరాయ కొండలకోనేటిరాయ ||
చ|| సామసంగీతరాయ సర్వమోహనరాయ | ధామవైకుంఠరాయ దైత్యవిభాళరాయ |
కామించి నిన్ను గోరితే గరుణించితివి నన్ను | శ్రీమంతుడ నీకు జయ శ్రీవేంకటరాయ ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం