సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: తలచినవన్నియు
టైటిల్: తలచినవన్నియు
పల్లవి:
ప|| తలచినవన్నియు దనకొరకే వెలి | దెలియుట దనలో దెలియుటకొరకే ||
చరణం:చ|| ఉదయమందుట భవముడుగుటకొరకే | చదువుట మేలువిచారించుకొరకే |
బ్రదుకుట పురుషార్థపరుడౌటకొరకే | యెదిరి గనుట తన్నెరుగుటకొరకే ||
చ|| తగులుట విడివడదలచుటకొరకే | నొగలుట కర్మమనుభవించుకొరకే |
చిగురౌట కొమ్మయి చెలగుటకొరకే | బెగడుట దురితము పెడబాయుకొరకే ||
చ|| యీవల జేయుట ఆవలికొరకే | ఆవలనుండుట యీవలికొరకే |
యీవలనావల నెనయ దిరుగుటెల్ల | శ్రీవేంకటేశ్వరు జేరుటకొరకే ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం