సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: తలప వెనక
టైటిల్: తలప వెనక
పల్లవి:
ప|| తలప వెనక నుయ్యి తగరు ముందట దీన | దొలగ నాకు దెరువుదోప దేమిసేతు ||
చరణం:చ|| మమకారము విముక్తిమార్గదూరము నీపై | మమతసేయక నాకు మనరాదు |
మమత మేలో నిర్మమత మేలో దీని- | క్రమమునక్రమము నే గాన నేమిసేతు ||
చ|| కర్మమార్గము జన్మగతికి జేరువు ని- |ష్కర్మము పాతకమునకు దొడవు |
కర్మి గావలెనో నిష్కర్మి గావలెనో యీ- | మర్మంపుమదము మాన దేమిసేతు ||
చ|| శరణాగతరక్షకుడవైనయట్టి- | తిరువేంకటగిరిదేవుడా |
పరిపూర్ణుడవో నీవు పరిచ్ఛిన్నుడవో ని- | న్నరసి భజింపలేనైతి నేమిసేతు ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం