సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: తలపోత బాతె
టైటిల్: తలపోత బాతె
పల్లవి:
ప|| తలపోత బాతె తలపులకు దమ- | కొల దెరంగనిమతి గోడాడగా ||
చరణం:చ|| ఆపదలు బాతె అందరికిని దమ- | చాపలపుసంపదలు సడిబెట్టగా |
పాపముల బాతె ప్రాణులకును మతి | బాపరానియాస దమ్ము బాధించగా ||
చ|| జగడాలు బాతె జనులకును దమ- | పగలైనకోపాలు పైకొనగా |
పగలుబాతె వలలబెట్టెడి తమ్ము | దగిలించు మమత వేదనముసేయగా ||
చ|| భయములు బాతె పరులకును తమ- | దయలేక అలయించుధనముండగా |
జయములు బాతె సతతమును యింత- | నయగారివేంకటనాథు డుండగాను ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం