సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: తలపు కామారుతత్త్వముమీద
టైటిల్: తలపు కామారుతత్త్వముమీద
పల్లవి:
ప|| తలపు కామారుతత్త్వముమీద నలవడిన- | నిల నెట్టివారైన నేలాగు గారు ||
చరణం:చ|| ఓలి నిరువురుసతుల నాలింగనముసేయ | లోలుడటుగాన నాలుగుచేతులాయ |
వేలసంఖ్యలుసతుల వేడుకల రమియింప | బాలుపడెగాన రూపములు పెక్కాయ ||
చ|| పొలయలుక కూటములభోగి దానటుగాన | మలసి యొక్కొకవేళ మారుమొగమాయ |
లలిత లావణ్య లీలావిగ్రహముగాన | కొలదివెట్టగరానిగోళ్ళు నిడుపాయ ||
చ|| చిరభోగసౌఖ్యముల జెంద ననుభవిగాన | తిరువేంకటాచలాధీశ్వరుండాయ |
పరగ సంసారసంపదకు బద్ధుడుగాన | అరుదుగా సకలాంతరాత్మకుడాయ ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం