సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: తలపులోపలితలపు
టైటిల్: తలపులోపలితలపు
పల్లవి:
ప|| తలపులోపలితలపు దైవమితడు | పలుమారు బదియును బదియైనతలపు ||
చరణం:చ|| సవతైనచదువులు సరుగ దెచ్చినతలపు | రవళి దరిగుబ్బలిని రంజిల్లుతలపు |
కవగూడి గోరు భూకాంతముంగిటితలపు | తివిరి దూషకు గోళ్ళ దెగటార్చుతలపు ||
చ|| గొడుగువట్టినవాని గోరి యడగినతలపు | తడబడక విప్ప్రులకు దానమిడుతలపు |
వొడసి జలనిధిని గడగూర్చి తెచ్చినతలపు | జడియక హలాయుధము జళిపించుతలపు ||
చ|| వలపించి పురసతులవ్రతము చెరిచినతలపు | కలికితనములు చూపగలిగున్నతలపు |
యిల వేంకటాద్రిపై నిరవుకొన్నతలపు | కలుషహరమై మోక్షగతిచూపుతలపు ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం