సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: తనదీగాక
టైటిల్: తనదీగాక
పల్లవి:
ప|| తనదీగాక యిందరిదీగాక | తనువెల్ల బయలై దరిచేరదు ||
చరణం:చ|| కడుపూ నిండదు కన్నూ దనియదు | కడగి లోనియాకలియు బోదు |
సడిబడి కుడిచినకుడుపెల్ల నినుము- | గుడిచిననీరై కొల్లబోయె ||
చ|| చవియూ దీరదు చలమూ బాయదు | లవలేశమైన నొల్లకపోదు |
చివచివ నోటికడవలోనినీరై | కవకవ నవియుచు గారీని ||
చ|| అలపూ దోపదు అడవీ నెండదు | యెలయించుభంగమయిన బోదు |
తెలిసి వేంకటగిరిదేవుని దలపించు- | తలపైన దనకు ముందర నబ్బదు ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం