సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: తనిసితి నన్నిటాను
టైటిల్: తనిసితి నన్నిటాను
పల్లవి:
ప|| తనిసితి నన్నిటాను తాలిమే మేలిమాయ | యెనసిన సంతసములిక నెన్నడే ||
చరణం:చ|| ఆసలనే కొంతవద్దు అంగమంటి కొంతవొద్దు | బాసజేసి కొంతవొద్దు భ్రమయించెను |
వాసికి సరసమాడ వయసు వోయీనేమో | యీసు దీర మన్నించేదిక నెన్నడే ||
చ|| మోము చూపి కొంత వొద్దు మొక్కులాడి కొంత వొద్దు | నాముదేర నవ్వి కొంత నాలి సేసెను |
ఆమని గుంటెన మాటలాడగనే తెల్లవారె | యీమేర నన్నుగూడేదిక నెన్నడే ||
చ|| చేయివేసి కొంత వొద్దు సేసవెట్టి కొంతవొద్దు | యీయెడ గాగిట గూడె నీపొద్దు |
పాయపు శ్రీ వేంకటాద్రిపతి కింతా సెలవాయ | యేయెడ జొక్కదుగాక యిక నెన్నడే ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం