సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: తనివి దీరక
టైటిల్: తనివి దీరక
పల్లవి:
ప|| తనివి దీరక నను తమకమున నెంతేని | చెనకేవు వద్దు నీ చిత్తమిక నోరి ||
చరణం:చ|| దంటవై నాచేత దలపించు కొనగ దొర- | కొంటి వింక నిది నీకు కొలది బడునా |
నంటున నాప్రియము నాటిలను నిన్ను నా- | వెంట ద్రిప్పక నిన్ను విడుతునా వోరి ||
చ|| గబ్బివై నావాలు గనుగొనల నవ్వులకు | నుబ్బేవు నీవు నీ వొడబడికల |
నిబ్బరపు నా వలపు నెలకొన్నయపుడేని | అబ్బురంబగు గర్వమణచనా వోరి ||
చ|| మెట్టుకొని నీవు నా మెఱుగు బయ్యద చెఱగు | పట్టేవు నీకు నీ పరిణామమా |
దిట్టవై కూడితివి తిరువేంకటేశ్వరుడ | యిట్టట్టు నిన్ను బోనిత్తునా వోరి ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం