సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: తనకర్మమెంత
టైటిల్: తనకర్మమెంత
పల్లవి:
ప|| తనకర్మమెంత చేతయు నంతే | గొనకొన్న పని యంత కూలే నంతే ||
చరణం:చ|| తలపులో హరి నెంత దలచె నేడే వాని- | కలిమియు సుఖమును గలదంతే |
తలదూచ బైడెంత తూకము నంతే | నెలకొన్నపిండెంత నిప్పటీ నంతే ||
చ|| సిరివరుపూజెంత సేసె నేడే వాని- | దరియును దాపు నెంతయు నంతే |
పురిగొన్న యీవెంత పొగడూ నంతే | నరపతిచనవెంత నగవూ నంతే ||
చ|| శ్రీ వేంకటపతి చింత యంత నేడే | భావపరవశము పలుకూ నంతే |
దైవము కృప యంత తానూ నంతే | యేవంక జయమెంత యిరవూ నంతే ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం