సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: తనకర్మవశం బించుక
టైటిల్: తనకర్మవశం బించుక
పల్లవి:
ప|| తనకర్మవశం బించుక, దైవకృతం బొకయించుక, | మనసువికారం బించుక, మానదు ప్రాణులకు ||
చరణం:చ|| ఈదైన్యము లీహైన్యము లీచిత్తవికారంబులు | యీదురవస్థలు గతులును యీలంపటములును |
యీదాహము లీదేహము లీయనుబంధంబులు మరి | యీదేహముగలకాలము యెడయవు ప్రాణులకు ||
చ|| యీచూపులు యీతీపులు నీనగవులు నీతగవులు- | నీచొక్కులు నీసొక్కులు నీవెడయలుకలును |
యీచెలుములు నీబలువులు నీచనువులు నీఘనతలు- | నీచిత్తముగలకాలము యెడయవు ప్రాణులకు ||
చ|| యీవెరవులు నీయెరుకవులు యీతలపులు నీతెలుపులు | దైవశిఖామణితిరుమల దేవునిమన్ననలు |
దైవికమున కిటువగవక తనతల పగ్గలమైనను | దైవము తానౌ తానే దైవంబవుగాన ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం