సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: తొక్కనిచోట్లు
టైటిల్: తొక్కనిచోట్లు
పల్లవి:
ప|| తొక్కనిచోట్లు దొక్కెడిమనసు | యెక్కడ గతిలే దింకనో తెరువు ||
చరణం:చ|| పాపము వాయదు పైపై మనసున | కోపము దీరదు కొంతైనా |
దీపనబాధయు దీరదు కొంతైనా | యేపున బెనగొనె నింకనో తెరువు ||
చ|| యెవ్వనమదమును నెడయదు కోరికె | కొవ్వును నణగదు కొంతైనా |
రవ్వగుమమకారము బెడబాయదు | యెవ్విధియును లేదింకనో తెరువు ||
చ|| వెఱపును విడువదు వెడమాయలబడి | కొఱతయు దీరదు కొంతైనా |
తెఱగొసగేటి శ్రీతిరువేంకటపతి- | నెఱిగీనెఱగలే మికనో తెరువు ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం