సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: తొల్లింటి వలె
టైటిల్: తొల్లింటి వలె
పల్లవి:
ప|| తొల్లింటి వలె గావు తుమ్మెదా యింక | వొల్లవుగా మమ్మువో తుమ్మెదా ||
చరణం:చ|| తోరంపు రచనల తుమ్మెదా కడు | దూరేవు గొందులే తుమ్మెదా |
దూరినా నెఱుగవు తుమ్మెదా మమ్ము | వోరగా చూడకు వో తుమ్మెదా ||
చ|| తొలి ప్రాయపు మిండ తుమ్మెదా కడు | తొలిచేవు చేగలే తుమ్మెదా |
తొలకరి మెరుగువే తుమ్మెదా ఇంక | ఉలికేవు మముగని వో తుమ్మెదా ||
చ|| దొరవు వేంకటగిరి తుమ్మెదా మా | తురుమేల చెనకేవు తుమ్మెదా |
దొరకెనీ చనవులు తుమ్మెదా ఇంక | ఒరులెఱింగిరి గదవో తుమ్మెదా ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం