సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: తొల్లియును మఱ్ఱాకు
టైటిల్: తొల్లియును మఱ్ఱాకు
పల్లవి:
ప|| తొల్లియును మఱ్ఱాకు తొట్టెలనె యూగెగన | చెల్లుబడి నూగీని శ్రీరంగశిశువు ||
చరణం:చ|| కలికి కావేరి తరగల బాహులతలనే | తలగ కిటు రంగ మధ్యపు తొట్టెలను |
పలుమారు దనునూచి పాడగా నూగీని | చిలుపాల సెలవితో శ్రీరంగశిశువు ||
చ|| అదివో కమలజుని తిరువారాధనం బనగ | అదన గమలభవాండమను తొట్టెలను |
ఉదధులు తరంగముల నూచగా నూగీని | చెదరని సిరులతోడ శ్రీరంగశిశువు ||
చ|| వేదములే చేరులై వెలయంగ శెషుడే | పాదుకొను తొట్టెలై పరగగాను |
శ్రీదేవితో గూడి శ్రీవేంకటేశుడై | సేదదీరెడి వాడె శ్రీరంగశిశువు ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం