సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: తొలుబాపపుణ్యాలతోడ
టైటిల్: తొలుబాపపుణ్యాలతోడ
పల్లవి:
ప|| తొలుబాపపుణ్యాలతోడ బుట్టితినట | బలువైనభవముల భడలేనా ||
చరణం:చ|| గాములయింటినే కాపనయితినట | పాముపుట్టనుండియైన బతుకలేనా |
గోమున హేయపుగుండకూడు నించితినట | గామిడినేగారేతిత్తి గానోపనో ||
చ|| కట్లైనగుణములచే కట్టువడితినట | చుట్టపుబంధాలరొచ్చుకు నోపనా |
దట్టపుటాసల నేదాల్చితినట నా- | వెట్టకాయము మోవవెరచేనా ||
చ|| నిగిడినలోపల నీ వుండుదువట | పగవారికి నే బగిలేనా |
తగువేంకటేశ నీదయవాడనట యీ- | వగల నిన్నిట గెలువగలనా ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం