సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: తోరణములే దోవెల్లా
టైటిల్: తోరణములే దోవెల్లా
పల్లవి:
ప|| తోరణములే దోవెల్లా | మూరట బారట ముంచినలతల ||
చరణం:చ|| కూరిమిమటములు గోపురంబులును | తేరుపడగెలే తెరువెల్లా |
కోరినపండ్లుగురి సేటితరువులు | తోరములైన వెదురుజొంపములు ||
చ|| ఆటలు దిరుపులు నందపుటురుపులు | పాటలు వనవైభవమెల్లా |
కూటువనెమళ్ళ కోవిలగుంపుల | పేటల దేటలపెనుగూటములు ||
చ|| వింజామరలును విసనకర్రలును | గొంజెగొడుగులే కొండెల్లా |
అంజనగిరిరాయడు వేంకటపతి | సంజీవని పరుషల కొదవగను ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం