సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: తప్పదు తప్పదు
టైటిల్: తప్పదు తప్పదు
పల్లవి:
ప|| తప్పదు తప్పదు దైవముకృప యిది | ముప్పిరి నింతా ముకుందుడే ||
చరణం:చ|| వెక్కసపుమతి వెలుతులుదీరిన- | నెక్కడ చూచిన నీశ్వరుడే |
గుక్కక యాసలు గోసివేసినను | నిక్కమడుగడుగు నిధానమే ||
చ|| పొంచి శరీరపుభోగము లుడిగిన | చుంచుబాపములు సుకృతములే |
దంచెడి విషయపు తగులము బాసిన | యెంచిచూచినను యిహమే పరము ||
చ|| శ్రీవేంకటపతి సేవే కలిగిన | వేవేలువగలు వేడుకలే |
చేవదీరె సందియము లేదిదే | భావమునమ్మిన ప్రపన్నులకు ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం