సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: తరుణి మేనికిని
టైటిల్: తరుణి మేనికిని
పల్లవి:
ప|| తరుణి మేనికిని నీ తనువె మాటు | నిరుతపుటాసకు నిండు జూపె మాటు ||
చరణం:చ|| చెలియ సిగ్గులకు చెక్కు చేయే మాటు | పలుకులకును మోవి పండే మాటు |
నెలకొన్న చింతలకు నివ్వెరగే మాటు | బలు జవ్వనమునకును పయ్యెదే మాటు ||
చ|| ముంచిన నవ్వులకును మొక్కులివే మాటు | మంచి నడపులకు మట్టెలే మాటు |
వంచిన శిరస్సునకు వాలుగొప్పే మాటు | కొంచని చనులకు కొనగోరే మాటు ||
చ|| పొందుల రతులకును పుక్కిటి విడెమే మాటు | అందిన వేడుకకౌ నాయములె మాటు |
విందుల రతులకు వేవేలు వలపులె మాటు | యిందుముఖికై శ్రీ వేంకటేశ నీ యింపె మాటు ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం