సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: తతిగని తతినేల
టైటిల్: తతిగని తతినేల
పల్లవి:
ప|| తతిగని తతినేల తమకించరే | మతిలోని నొప్పి గొంత మాన నియ్యరే ||
చరణం:చ|| పతిబాసి వున్నదాన బలువిరహపు వేళ | యితవంటా విరులు నాకేల యిచ్చేరే |
రతిరాజు నమ్ములివి రంట దెప్పరపు వెళ | కతుకున నాటుజేసు గవిశన నిడరే ||
చ|| కందువ జవ్వనమున గావరించి వున్నవేళ | యిందమంటా గందము నాకేల పూసేరే |
మంద మారుతాన కవి మచ్చు చల్లే చొక్కుమందు | యిందుకేల పెట్టె గట్టి యింటిలోన నిడరే ||
చ|| శ్రీ వేంకటేశువొద్ద సిగ్గుపడి వున్నదాన | చేవదేర నిప్పుడేమి సింగారించేరే |
యీవల నాతడు గూడె యీసొమ్ము లిన్నియును | వేవే లాతడిచ్చినవె వేగిర పడకురే ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం