సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: ఉమ్మడినే యేమనినా
టైటిల్: ఉమ్మడినే యేమనినా
పల్లవి:
ఉమ్మడినే యేమనినా మారకుండను |
అమ్మరో యెంతట గబ్బియనకు మీ నన్నను ||
మాటలు నీ వాడితేను మంచి తేనెలుగారీని |
గాటమై నీ చేతవై తే కారమయ్యీని |
యీటు వెట్టితే జవి యిదొకటీ నదొకటీ |
కూటమి కాననరాదు కోపగించరాదు ||
కన్నుల నీవు చూచితే కడు వెన్నెల గాసీని |
యెన్నబోతే నీ సుద్దులు యెండగాసీని |
పన్నినవి నీ గుణాలు పచ్చియును వెచ్చియును |
అన్నీ జేతబట్టరాదు అటు దోయరాదు ||
నీ వాసలు వెట్టితేను నిలువు నూరు వండీని |
భావించి నీ సింగారాలు పాలుకొనీని |
యీవల శ్రీ వేంకటేశ యింతలో నన్నేలితివి |
చేవదేరె ననరాదు చిగురనరాదు ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం